NTV Telugu Site icon

India’s wedding industry: నవంబర్, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

India’s Wedding Industry

India’s Wedding Industry

India’s wedding industry: భారతీయ వివాహ పరిశ్రమ పుంజుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏకంగా 35 లక్షల వివాహాలు జరగబోతున్నాయని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, 2023లో ఇదే కాలంలో 3.2 మిలియన్ల జంటలు ఒక్కటయ్యాయి. ఈ ఏడాది 3.5 మిలియన్ల పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనా. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 15-జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాలకు సుమారుగా 5.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ యొక్క నివేదిక,‘‘బ్యాండ్, బాజా, భారత్ అండ్ మార్కెట్స్‌’’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

Read Also: Supreme Court: హైకోర్ట్ జడ్జి ‘‘పాకిస్తాన్’’, ‘‘లోదుస్తులు’’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ 2025(FY25)లో 49 మూహూర్త రోజులు, FY24లో 60 రోజులు ఉన్నట్లు తెలిపింది. భారతదేశం సంవత్సరానికి సుమారు 10 మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వెడ్డింగ్ మార్కెట్‌గా ఉంది. పెళ్లిళ్లకు తోడుగా ఇంటారాక్టివ్ కార్యక్రమాలు, మల్టీసెన్సరీ ఫుడ్ కౌంటర్లు, డ్రోన్ షోలు, ఆడియో ఇన్విటేషన్ ఇలాంటివి పెళ్లిళ్ల ఖర్చుల్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. గిఫ్ట్ పోర్టల్ FNP ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 30-40 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. దీనికి తోడు ఈ ఏడాది వివాహాలు నిర్వహించడానికి చాలా మంది ఎన్నారై జంటలు భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ఫెర్న్స్ ఎన్ పెటల్స్ వ్యవస్థాపకుడు మరియు ఎండి వికాస్ గుట్గుటియా తెలిపారు. ప్రభుదాస్ లిల్లాధర్ నివేదిక ప్రకారం.. బంగారంపై దిగుమతి సుంకాలు 15 శాతం నుంచి 6 శాతం తగ్గడంతో దేశవ్యాప్తంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లలో గణనీయమైన పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది.