Site icon NTV Telugu

Nitin Gadkari: ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్..

India Road Network

India Road Network

Nitin Gadkari: ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గత 9 ఏళ్లలో భారతదేశంలో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో భారత రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారతదేశం దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్ వర్క్ కలిగి ఉందని ఆయన వెల్లడించారు. ఇది ప్రపంచంంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అని అన్నారు.

Read Also: Lord Vishnu Statue In Sea: నడి సముద్రంలో నారాయణుడి విగ్రహం.. షాక్ లో మత్స్యకారులు

2013-14లో 91,287 కిలోమీటర్ల ఉన్న రోడ్డు వ్యవస్థ ఈ రోజు 1,45,240 కిలోమీటర్లకు చేరిందని ఆయన వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రభుత్వానికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ భారత్ లోనే ఉందని.. మొదటిస్థానంలో అమెరికా ఉందని ఆయన అన్నారు. 2013-14లో రూ. 4,770 కోట్ల నుంచి టోల్‌ల ఆదాయం ₹ 4,1342 కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. 2030 నాటికి టోల్ ఆదాయాన్ని ₹ 1,30,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించడంలో సహాయపడిందని, దీన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

Exit mobile version