Site icon NTV Telugu

Retail inflation: 18 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం..

Retail Inflation

Retail Inflation

Retail inflation: ఏప్రిల్ నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కంఫర్ట్ జోన్ లోనే వరసగా రెండో నెల కొనసాగినట్లు నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. వినియోగదారుల ధర సూచి ఆధారంగా (సీపీఐ) ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో 4.7 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 5.66 శాతంగా ఉంటే ఇది ఏప్రిల్ లో 4.7 శాతానికి చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. నవంబర్ 2021 నుంచి పోలిస్తే తొలిసారిగా 5 శాతాని కన్నా దిగువకు ద్రవ్యోల్బణం చేరింది.

Read Also: Gudivada Amarnath: పవన్‌ చేతులేత్తేశారు.. సీఎం కావాలంటే మూడు పెళ్లిళ్లు చేసుకున్నంత ఈజీ కాదు..!

ఆహార ధరలు తగ్గుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఆహార ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 4.79 శాతం నుంచి 3.84 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.68 శాతంగా ఉండగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉందని డేటా వెల్లడించింది. వరసగా వడ్డీరేట్ల పెంపు తర్వాత గత సమీక్షలో వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ అలాగే ఉంచింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్బీఐకి ఉపశమనం కలిగించింది. చాలా మంది ఆర్థికవేత్తలు అంచనాలకు అనుగుణంగానే ద్రవ్యోల్భణం దిగివచ్చింది.

వివిధ రంగాల వృద్ధిరేటను చూపే పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు కూడా మార్చిలో 1.1 శాతానికి పెరిగింది. 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుండి ధరల డేటాను సేకరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆహారం, ఇంధన ధరలు ద్రవ్యోల్బణం తగ్గుదలకు దోహదపడ్డాయి. ఏప్రిల్ 2022లో ద్రవ్యోల్బణం 7.8 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ సేఫ్ జోన్ 6 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ.

Exit mobile version