India: భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో బాధపడుతుంటే.. భారత్ మాత్రం ఈ ఏడాది జీడీపీలో టాప్ 1 స్థానంలో నిలుస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో భారతదేశంలో మధ్యతరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని.. అలాగే 2031 నాటికి పేదల సంఖ్య దాదాపుగా సగానికి తగ్గుతుందని పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ అండ్ ఇండియాస్ సిటిజన్ ఎన్విరాన్‌మెంట్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తేలింది.
ఈ దశాబ్ధం చివరినాటికి భారత దేశంలో ‘సూపర్ రిచ్’ కుటుంబాలు ఐదు రెట్లు పెరుగుతాయని అంచనా వేసింది. పేదలు అత్యధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ వృద్ధి కనిపిస్తుందని తెలిపింది. 2021 నాటికి 20 మిలియన్ రూపాయలను($243,230) కన్నా ఎక్కువ సంపాదిస్తున్న సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య ఐదేళ్లలో 1.8 మిలియన్లకు దాదాపుగా రెండింతలు అవుతుందని నివేదిక తెలిపింది. గ్రామాల్లో ఇటువంటి కుటుంబాల వృద్ధి 14.2 శాతం, నగరాల్లో 10.6 శాతం ఉంటుందని పేర్కొంది.
Read Also: Pakistan Rains: పాక్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ వర్షం.. 30ఏళ్ల రికార్డు బద్దలు
2031 నాటికి సూపర్ రిచ్ కుటుంబాలు 9.1 మిలియన్లకు పెరుగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. 25 రాష్ట్రాల్లో 40,000 కంటే ఎక్కువ మందిని సర్వే చేసిన తర్వాత ఈ అధ్యయనం ఈ గణాంకాలను పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాణిజ్య వ్యవసాయ వ్యపారాలతో పాటు వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమయ్యారని.. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నివేదిక రచయిత రాజేశ్ శుక్లా చెప్పారు. ఎంటర్‌ప్రెన్యూయర్లు గ్రామీణ ప్రాంతాలకు వరదల వస్తున్నారి.. ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉద్యోగాలు, చిన్నవ్యాపారాలను సృష్టిస్తున్నారని అన్నారు. గ్లోబల్ మేనేజర్లు, విదేశీ బ్యాంకులు భారతదేశంలో పెరుగుతున్న మిలియనీర్లకు నిలయంగా మారతున్నాయని చెప్పారు.
20185-2022 మధ్య భారతదేశంలో ప్రతీరోజూ 70 మంది కొత్త మిలియనీర్లను తయారుచేసిందని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. మిడిల్ క్లాస్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడంతో పాటు విదేశీ సెలవుల కోసం ఖర్చు చేస్తున్నారని, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ గౌతమ్ అదానీ వంటి బిలియనీర్ల వంటి వారి వేగవంతమైన పెరుగుదలను చూస్తోందని నివేదిక వెల్లడించింది. దేశంలో ఏడాదికి 6000-36,000 వరకు సంపాదిస్తున్న 43.2 కోట్ల మధ్యతరగతి వర్గం విస్తరిస్తుందని, ఇది 2031 నాటికి 71.5 మిలియన్లకు చేరుతుందని అంచానా వేసింది. అలాగే నిరుపేదలు ఆ సమాయానికి 7.9 కోట్లలో సగాని కన్నా ఎక్కువగా తగ్గుతారని నివేదిక వెల్లడించింది.