India Pakistan: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అప్పుల కోసం పలు దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భిక్షం అడుక్కుంటోంది. రుణాలు, బెయిలౌట్ ప్యాకేజీలపై ఎక్కువగా ఆధారపడుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీసేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఉగ్రవాద నిధుల నిఘా సంస్థ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF)ని భారత్ సంప్రదించనుంది. జూన్‌లో పాకిస్తాన్‌కి 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆమోదించడాన్ని పునఃపరిశీలించాలని భారతదేశం ప్రపంచ బ్యాంకును కోరుతుందని సోర్సెస్ తెలిపాయి.
Read Also: Bandi Sanjay: కవిత రాసిన లేఖ ఒక OTT ఫ్యామిలీ డ్రామా.. టైటిల్ “కాంగ్రెస్ వదిలిన బాణం”
పాకిస్తాన్‌ని తిరిగి గ్రే లిస్ట్ లోకి తీసుకురావడానికి భారతదేశం FATFని సంప్రదిస్తోంది. ఈ సంస్థ పాకిస్తాన్ ఆర్థిక లావాదేవీలపై పరిశీలన పెంచుతుంది, విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాలను పరిమితం చేస్తుంది. జూన్ 2018లో పాకిస్తాన్‌ను FATF ‘గ్రే లిస్ట్’లో ఉంచారు. అయితే, ప్రభుత్వం ఉగ్రవాద నిధులను అరికట్టడానికి కట్టుబడి ఉండటంతో 2022 అక్టోబర్‌లో దానిని జాబితా నుండి తొలగించారు. ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను జైలులో పెట్టినట్లు , జప్తు చేసినట్లు పాకిస్తాన్ కూడా పేర్కొంది.
అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ నిధులను ఉగ్రవాదానికి వాడుతుందని భారత్ ఆరోపిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఐఎంఎఫ్ 1 బిలియన్ డాలర్ల నిధులు ఇవ్వడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్ గత రికార్డులను చూసి నిధులను ఇవ్వాలని భారత్ కోరింది. అయినా కూడా ఐఎంఎఫ్ పాకిస్తాన్‌ని రుణం మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వకుండా కట్టడి చేసేందుకు భారత్ ప్రయత్ని్స్తోంది.
