Site icon NTV Telugu

UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై

Triclour

Triclour

UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.

తాజాగా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ముందు నిరసనకు పాల్పడ్డారు. రాయబార కార్యాలయం వెలుపల ఉన్న త్రివర్ణ పతాకాన్ని తీసేశారు. అయితే కొద్ది సేపటికే భారత్ హైకమిషన్ సిబ్బంది, భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఖలిస్తానీ మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. భారతీయులు ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్విట్టర్ లో ఈ ఫోటోను పంచుకుంటూ.. ‘‘ఝండా ఊంచా రహే హమారా’’, లండన్ లోని భారత హైకమిషన్ లో భారత జెండాను అగౌరపరిచిన వారిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంజాబ్, పంజాబీలు అద్భుతమైన చరిత్ర ఉందని.. దేశానికి సేవ చేయడం, దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. యూకేలో కూర్చున్న కొందరు జంపింగ్ జాక్ లు పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించరని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత హైకమిషన్ చర్యను పలువురు నెటిజన్లు సమర్థించారు. రాయబార కార్యాలయం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ క్రిస్టినా స్కాట్ ను పిలిచి నిరసన తెలియజేసింది. భారత దౌత్యవేత్తలు, సిబ్బంది పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనను యూకే విదేశీ కామన్వెల్త్ మంత్రి లార్డ్ తారిక్ అహ్మద్ ఖండించారు. ఈ చర్య దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

 

Exit mobile version