Site icon NTV Telugu

Covid-19 Cases: దేశంలో 6000 మార్కును దాటిన కరోనా కేసులు..

Tips To Prevent Covid

Tips To Prevent Covid

Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 48 గంటల్లో 769 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6133.

Read Also: Donald Trump: “అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి”.. మస్క్‌కు ట్రంప్ వార్నింగ్..

కేరళ అత్యంత ప్రభావితం రాష్ట్రంగా కొనసాగుతోందని, ఆ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, మందుల లభ్యతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

గత 24 గంటల్లో దేశంలో మరో ఆరు మరణాలు నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా వరకు కేసుల లక్షణాలు చాలా తేలికగా ఉన్నాయని, ఇంట్లోనే వారి ఆరోగ్యం మెరుగవుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో 65 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ పరిస్థితి, సంసిద్ధత చర్యలను అంచనా వేయడానికి జూన్ 2, 3 తేదీలలో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా శర్మ అధ్యక్షతన సాంకేతిక సమీక్ష సమావేశాలు జరిగాయి.

Exit mobile version