NTV Telugu Site icon

India: పాకిస్తాన్ బోర్డర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్.. అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది..

Solar Plant

Solar Plant

India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.

726 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టు సింగపూర్ దేశ పరిమాణం అంత ఉంటుంది. 30 గిగావాట్ల(GW) విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. దీని వల్ల ఏకంగా 2 కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించవచ్చు. ఇంధన డిమాండ్‌ని తీర్చడంలో ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడనుంది.

Read Also: Minister Seethakka: సీతక్క మంత్రిగా ప్రమాణం.. దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం..

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ముంద్రా ఉంది. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సమగ్రమైన పునరుత్పాదక ఇంధన తయారీ ఎకో సిస్టమ్ అభివృద్ధి జరుగుతోంది. భారత్ సౌర, పవన విద్యుత్‌పై దృష్టి పెడుతోంది. స్వయం ఆధారిత మౌళిక సదుపాయాలను రూపొందించడంలో భారత్ అంకిత భావంతో పనిచేస్తోంది.

ఈ ప్రాంతంలో ఉన్న ఖవ్డా గ్రామం పేరుతోనే ఈ ప్రాజెక్టుకు ‘‘ఖవ్డా రిన్యుబుల్ ఎనర్జీ పార్క్’’గా పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు వ్యయం 2.6 బిలియన్ డాలర్లుగా అంచానా వేశారు. COP28 వాతావరణ సమ్మిట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ప్రపంచంలోనే ఖవ్దా ప్రాజెక్టు అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్‌గా నిలుస్తుంది.

Show comments