Site icon NTV Telugu

Iran: భారతీయులకు వీసా అవసరం లేదు.. ఇరాన్ కీలక నిర్ణయం..

Iran

Iran

Iran: భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్‌తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను పెంచడంతో పాటు, ప్రపంచదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిచారు. పర్యాటకాన్ని పెంచే ప్రయత్నాలు ఇరానోఫోబియా ప్రచారాన్ని నిర్వీర్యం చేయగలవని ఆయన అన్నారు.

Read Also: Gurpatwant Singh Pannun: “చెక్ కోర్టుకు వెళ్లండి”.. పన్నూ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు..

భారత్‌తో పాటు రష్యన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ట్యునీషియా, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, సీషెల్స్, ఇండోనేషియా, దారుస్సలాం, జపాన్, సింగపూర్, కాంబోడియా, మలేషియా , బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా మరియు హెర్జెగోవినా, సెర్బియా, క్రొయేషియా మరియు బెలారస్ దేశాలకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. దీనికి ముందు టర్కీ, అజర్ బైజాన్, ఒమన్, చైనా, ఆర్మేనియా, లెబనాన్, సిరియా దేశల పర్యాటకులకు వీసా మినహాయింపు ఉంది.

ప్రస్తుతం భారత్ నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్ వెళ్లే వారికి మాత్రమే వీసా అనుమతి నుంచి మినహాయింపు ఉండేది. ప్రస్తుతం పర్యాటకులను కూడా ఈ జాబితాలో చేర్చింది. గత కొన్ని రోజులుగా పలు దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని పలు దేశాలు కల్పిస్తున్నాయి. శ్రీలంక, మలేషియా, థాయ్ లాండ్, కెన్యాలు ఇప్పటికే భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పించగా.. తాజాగా ఇరాన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

Exit mobile version