NTV Telugu Site icon

Indians In US: బిక్కుబిక్కుమంటున్న భారతీయులు.. యూఎస్ నుంచి ‘‘సెల్ఫ్ డిపొర్టేషన్’’ భయం..

Indians In Us

Indians In Us

Indians In US: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయులను కూడా బహిష్కరించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికాలోని వేలాది మంది భారతీయులు H-4 వీసా కింద మైనర్లుగా వలస వెళ్లారు. ఇందులో చాలా మంది వయసు 21 ఏళ్లకు చేరుకుంటుండటంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, ఇలాంటి వారు ఇకపై H1-B వీసా హోల్డర్ తల్లిదండ్రులపై ఆధారపడినవారుగా అర్హత పొందలేరు.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..

చాలా మంది ఇప్పుడు కెనడా, యూకే వంటి దేశాలకు వలస వెళ్లడం, ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ వ్యవస్థలో భారీ స్థాయిలో పెండింగ్ అప్లికేషన్స్ ఉండటం భారతీయ వలసదారులను ప్రభావితం చేస్తుంది. US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇటీవల 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసాల రిజిస్ట్రేషన్ వ్యవధిని ప్రకటించింది. ఈ ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగుతుంది. H-1B వీసా, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు, వృత్తి పరమైన నైపుణయాలు కలిగిన విదేశీ వర్కర్లను అమెరికన్ కంపెనీలు నియమించుకునేందుకు అనుమతిస్తాయి. ప్రస్తుతం H-1B వీసాల పరిమితి సంవత్సరానికి 65,000 వీసాల వద్దే ఉంది. మోసాలను తగ్గించడానికి, న్యాయమైన ఎంపికను నిర్ధారించడానికి USCIS లబ్ధిదారుల-కేంద్రీకృత ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టింది.

మార్చ్ 2023 వరకు దాదాపుగా 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు, వారి ఫ్యామిలీలు గ్రీన్ కార్డ్ పొందడానికి ముందే డిపెండెంట్ వీసా నుంచి బయటకు వస్తున్నారని అంచనా. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో పెండింగ్ కారణంగా చాలా మంది శాశ్వత నివాసం కోసం చాలా కాలంగా వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని అప్లికేషన్లకు ఏకంగా 12 నుంచి 100 ఏళ్ల వరకు పట్టొచ్చని అంచనా.