Site icon NTV Telugu

Punjab: భారత జవాన్‌ను నిర్భంధించిన పాకిస్తాన్

Indo Pak Border

Indo Pak Border

Indian Soldier Accidentally Crosses Border, Captured By Pakistan: అనుకోకుండా సరిహద్దు దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) జవాన్ ని నిర్భంధించింది పాకిస్తాన్. సరిహద్దు దాటడంతో పాక్ రేంజర్లు అన్ని పట్టుకున్నారని అధికారులు వెల్లడించారు. పంజాబ్ సెక్టార్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. అతన్ని భారత్ కు అప్పగించడం కోసం వేచి చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇలా అనుకోకుండా బోర్డర్ క్రాస్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత వారం డిసెంబర్ 1న భారత్-పాకిస్తాన్ బోర్డరో లో జీరో లైన్ చెకింగ్ చేస్తుండగా.. ఒక జవాన్ పాకిస్తాన్ వైపు వెళ్లాడు. ప్రస్తుతం ఇది రెండో సంఘటన.

Read Also: Himachal pradesh Results: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే లక్ష్యం

పాకిస్తాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ జరిగిన తర్వాత అదే రోజు జవాన్ను పాకిస్తాన్ రేంజర్లు భారత్ కు అప్పగించారు. ప్రస్తుతం కూడా ఇదే విధంగా సరిహద్దు దాటిని జవాన్ ను పాకిస్తాన్ అధికారులు అప్పగించనున్నారు. బుధవారం దట్టమైన పొగమంచు కారణంగా, విజన్ సరిగ్గా లేకపోవడం వల్ల భారత జవాన్ పొరపాటున సరిహద్దు దాటినట్లు అధికారులు వెల్లడించారు. బీఎస్ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లతో టచ్ లో ఉన్నారు.

Exit mobile version