NTV Telugu Site icon

INS Arighaat: అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష

Ins

Ins

INS Arighaat: భారత్‌కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి కే4 బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించారు. విశాఖ తీరంలో భారత నౌకాదళం దీనిని నిర్వహించిందని రక్షణ రంగ అధికారులు చెప్పారు. అరిఘాత్‌ నుంచి కే4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా మంగళవారం నిర్వహించిన ఈ ప్రయోగం యొక్క ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను రెండు నెలల క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ మాదిరిగానే అరిఘాత్‌ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం విశాఖపట్నం నేవల్‌ డాక్‌ యార్డులోని ‘షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌’లో 2011 డిసెంబరులో చేపట్టగా.. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జల ప్రవేశం చేసింది. ఆ తర్వాత అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక టెక్నాలజీతో రాడార్‌ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం లాంటి కీలక పనులన్నింటినీ కంప్లీట్ చేశారు.

Read Also: Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్

అయితే, ప్రపంచంలోనే బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించ గల అణు జలాంతర్గాములు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఆరోది. ఇక, భారత్ కంటే ముందు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, చైనా ఉన్నాయి. అలాగే, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే కే-15, కే-4 క్షిపణులను కూడా భారత్‌ ప్రస్తుతం అభివృద్ధి చేస్తుంది. చైనాను దృష్టిలో ఉంచుకొని 3500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్ లను ఈజీగా ఛేదించేలా వాటిని రూపొందిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.