NTV Telugu Site icon

Indian Army Chief: లెబనాన్‌- ఇజ్రాయెల్ యుద్ధంపై భారత ఆర్మీ చీఫ్ రియాక్షన్ ఇదే..!

Army Chief

Army Chief

Indian Army Chief: లెబనాన్‌లో హెజ్‌బొల్లా శ్రేణులే టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన ‘పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్‌’తో ప్రపంచ షాక్ అయిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ గ్రూప్‌ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో పేలుడు పదార్థాలతో ఉన్న పేజర్లను పంపేందుకు ఇజ్రాయెల్‌ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. అదొక మాస్టర్‌ ప్లాన్ అన్నారు. మనం దాడులు స్టార్ట్ చేసిన రోజు యుద్ధం ప్రారంభమైనట్టు కాదు.. ప్రణాళిక రెడీ చేసిన రోజే యుద్ధం మొదలైనట్టని ద్వివేది పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: ‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’

ఇక, ఇజ్రాయెల్ భిన్నంగా ఆలోచన చేసింది అని భారత ఆర్మీ చీఫ్ ద్వివేది చెప్పారు. హమాస్ తమ ప్రధాన లక్ష్యమని నిర్ణయించుకుని దాడి చేసింది.. ఆ తర్వాత టార్గెట్ మార్చి.. పేజర్ల పేలుడుతో భారీ దాడి చేసిందన్నారు. చాణక్య డిఫెన్స్ డైలాగ్‌ వేదికగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా సమకాలీన అంశాలపై చర్చలు జరిపి జాతీయ, ప్రాంతీయ స్థాయిలో భద్రతాపరమైన సవాళ్లను నవీన సాంకేతికతల సాయంతో పరిష్కరించడానికి కావాల్సిన విధివిధానాలను రూపొందిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.

Read Also: Hezbollah: అక్టోబర్‌ 7 తరహాలో భారీ దాడికి హెజ్‌బొల్లా ప్లాన్‌..

అలాగే, భారతదేశ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి.. సాధారణ పరిస్థితి రాలేదన్నారు. చైనా విషయంలో మనం పోటీపడాలి.. పోరాడాలి.. సహకరించాలని కోరారు. మనకు సంబంధించినంత వరకు 2020 నాటి పరిస్థితులు వచ్చే వరకు ఇదంతా సున్నితమైన వ్యవహారమే అని ఆయన తెలిపారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నాం.. చర్చల సమయంలో దౌత్యపరంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ ఇంకా జరగలేదని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పుకొచ్చారు.

Show comments