Anant Shastra: పాకిస్తాన్, చైనా సరిహద్ధుల్ని మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వైమానిక రక్షణ నెట్వర్క్‌ను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఐదు నుంచి ఆరు రెజిమెంట్ల ‘‘ అనంత శస్త్ర’’ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది. ఉపరితలం నుంచి గగనతల క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది. డీఆర్డీఓ తయారు చేసిన ఈ క్షిపణి వ్యవస్థను భారత సైన్యం కొనుగోలు చేయనుంది. దీనిని అంతకుముందు క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) అని పిలిచేవారు.
Read Also: Epstein Files: అమెరికన్ రాజకీయాల్లో కొత్త సంచలనం.. ఎప్‌స్టైన్ ఫైళ్లలో ప్రపంచ కుబేరుడి పేరు.. !
భారత్ వద్ద ఇప్పటికే ఆకాష్, మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (MRSAM) వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఆపరేషన్ సిందూర్ సమయంలో సమర్థవంతంగా పనిచేశాయి. మే నెలలో ఆపరేషన్ సిందూర్ చర్య జరిగిన వెంటనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. ఈ వ్యవస్థని పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో మోహరించనుంది. ఈవ్యవస్థ కొనుగోలుకు రూ. 30,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ వ్యవస్థ భారత సైన్యం వాయు రక్షణను బలోపేతం చేస్తుందని, ఇది ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ డ్రోన్ దాడుల్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిందని సైన్యం తెలిపింది.
అనంత శస్త్ర వైమానిక రక్షణ వ్యవస్థలు అత్యంత తేలిక తరలించే అవకాశం ఉంటుంది. వీటిని త్వరగా ఫ్రంట్ లైన్‌లో మోహరించవచ్చు. ఇది కదలికలో లక్ష్యాలను శోధించే, ట్రాక్ చేయగలిగే సామర్థ్యాలను కలిగి ఉంది. దీని పరిధి 30 కి.మీ ఉంటుంది. ఈ వ్యవస్థ ఎంఆర్ సామ్, ఆకాష్ వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. ట్రయల్స్ సమయంలో దీనిని రాత్రి, పగలు వేళల్లో పరీక్షించారు.
