Site icon NTV Telugu

US-India Trade Deal: భారతదేశంతో త్వరలో వాణిజ్య ఒప్పందం: యూఎస్ వాణిజ్య కార్యదర్శి..

Modi Trump

Modi Trump

US-India Trade Deal: భారత్, అమెరికా మధ్య త్వరలో ‘‘వాణిజ్య ఒప్పందం’’ ఖరారు కావచ్చని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఈ వారం న్యూఢిల్లీలో జరిగే భారత్-అమెరికా చర్చల చివరి రౌండ్‌ సమావేశాలకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ‘‘ఇరు దేశాలు కలిసి పనిచేసే స్థలాన్ని కనుగొన్నాము కాబట్టి, త్వరలోనే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం వస్తుందని మీరు ఆశించాలి’’ అని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యుఎస్‌ఐఎస్‌పిఎఫ్) ఎనిమిదవ ఎడిషన్‌లో లుట్నిక్ ఆదివారం చెప్పారు. ఒప్పందాల వల్ల భారత్ మరింత అనుకూలమైన నిబంధనలు పొందవచ్చని లుట్నిక్ అన్నారు.

Read Also: US China Trade War: వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, ఈ వారం డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..

“యుఎస్‌-ఇండియా-జపాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అత్యుత్తమ కృషికి గాను” యుఎస్‌ఐఎస్‌పిఎఫ్ 2025 గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డులను ఐబిఎం చైర్మన్ అరవింద్ కృష్ణ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, హిటాచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తోషియాకి హిగాషిహారాకు ప్రదానం చేసింది. క్వాడ్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఆస్ట్రేలియా, భారత్, జపాన్, యూఎస్‌లకు చెందిన వ్యాపార నాయకులను యుఎస్‌ఐఎస్‌పిఎఫ్ శిఖరాగ్ర సమావేశంలో సత్కరించడం ఇదే మొదటిసారి.

Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీ హర్యానా టూర్‌పై సర్వత్రా ఉత్కంఠ

మరోవైపు, వాణిజ్యాన్ని గణనీయంగా విస్తరించడం, ఒకరి వ్యాపారాలకు మరొకరు మార్కెట్ యాక్సెస్ ఇచ్చే లక్ష్యంగా ప్రతిపాదిత ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చురుకుగా పనిచేస్తున్నట్లు ఇటీవల భారత్ చెప్పింది. సోమవారం ఫ్రాన్స్‌లో మీడియాతో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ,‘‘రెండు దేశాలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయి, రెండూ ఒకరి వ్యాపారాలకు ప్రాధాన్యత ప్రాప్యతను ఇవ్వాలని కోరుకుంటున్నాయి. మేము ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం పని చేస్తున్నాము’’ అని అన్నారు.

భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం:

భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతిపాదిత ఒప్పందం మల్టీ సెక్టార్ డీల్‌గా పనిగణించబడుతోంది. మొదటి దశ సెప్టెంబర్-అక్టోబర్ 2025 నాటికి ఖరారు చేయబడుతుందని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రస్తుత ఇరు దేశాల వాణిజ్యాన్ని USD 191 బిలియన్ల నుండి USD 500 బిలియన్లకు రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ చివరి నాటికి ఖరారు చేయబడే తాత్కాలిక ఒప్పందంపై చర్చించడానికి అమెరికా ఒక ప్రతినిధి బృందాన్ని ప్రస్తుతం ఢిల్లీలో ఉంచింది. అయితే, ట్రంప్ భారత వస్తువుల ఎగుమతులపై విధించిన 26 శాతం పరస్పర సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలి భారత్ ఒత్తిడి చేస్తోంది.

Exit mobile version