Site icon NTV Telugu

India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

Thar Oil

Thar Oil

India Thae Plan: అమెరికా-ఇరాన్ యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తన ‘‘థార్’’ ప్రణాళికను అమలు చేస్తోంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచింది.

రికార్డ్ స్థాయిలో 1202 బ్యారెళ్ల ముడి చమురును జోధ్ పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి చేస్తోంది. గతేడాది ఇక్కడి నుంచి రోజుకు 705 బ్యారెళ్ల ఉత్పత్తి మాత్రమే జరిగేది. ఈ సంక్షోభం నేపథ్యంలో గతేడాది కన్నా 70 శాతం అధిక చమురు ఉత్పత్తిని పెంచింది. ఆయిల్ ఇండియా, జైసల్మేర్‌లోని బఘేవాలా చమురు క్షేత్రం నుండి ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్లాంట్లకు రవాణా చేస్తుంది. అక్కడి నుండి, ఆ ముడి చమురును పైప్‌లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కోయాలి రిఫైనరీకి రవాణా చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆయిల్ ఇండియా తన రాజస్థాన్ ఫీల్డ్ నుంచి 43,773 మెట్రిక్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది 32,787 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది. థార్ ఎడారిలోని చమురు ఈ సమయంలో కీలకంగా మారుతోంది.

1991లో వెలుగులోకి చమురు:

బికనేర్-నాగౌర్ సబ్ బేసిన్‌లో ఉన్న బఘేవాలా చమురు క్షేత్రం భారతదేశంలోని కొన్ని చమురు క్షేత్రాల్లో ఒకటి. ఆయిల్ ఇండియా 19 బావులలో సీఎస్ఎస్(సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్) కార్యకలాపాలను పూర్తి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే సుమారుగా 72 శాతం పెరుగుదల. 1991లో ఈ ప్రాంతంలో చమురును గుర్తించారు. 200.26 చదరపు కి.మీ విస్తీర్ణంలోని థార్ చమురు క్షేత్రంలో 52 బావులు ఉండగా, 33 పనిచేస్తున్నాయి. ఆయిల్ ఇండియా 2018లో తొలిసారిగా సీఎస్ఎస్ టెక్నాలజీని ప్రారంభించింది. ఈ క్షేత్రం నుంచి భారీ స్థాయిలో వెలికితీతకు వీలవుతుంది.

Exit mobile version