India-Canada Row: కెనడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది.. భారత్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులకు కెనడా ఆశ్రయం ఇవ్వడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కెనడా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కెనడా వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు, హింసను సమర్థించేవారికి ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపించింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు, వారు విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. భారత్‌తో సంబంధం ఉన్న వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కెనడా ఆశ్రయం ఇస్తున్నట్లు ఆ దేశానికి తెలియజేశామని చెప్పారు. వారిని అప్పగించాలనే భారత్ అభ్యర్థనలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయాలపై తాము దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
Read Also: KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే!
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై ప్రశ్నించగా.. భారత విదేశాంగ అధికారికంగా ఎలాంటి కమ్యూనికేషన్ జరపలేదని అన్నారు. ఈ రోజు వరకు కెనడియన్ అధికారుల నుంచి ఎలాంటి నిర్ధిష్ట ఆధారాలు, సమాచారం అందలేదని, కెనడా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆయన జైశ్వాల్ చెప్పారు.
కెనడా ఉగ్రవాదులకు స్థావరంగా మారుతోందని భారత్ విమర్శించడం ఇదే మొదటిసారి కారు. గతేడాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు సర్రేలో కాల్చి చంపారు. ఆ సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని భారత్ తిరస్కరించింది, ఇది రాజకీయ ప్రేరేపిత అసంబద్ద వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా తన దేశాన్ని ఉగ్రవాదులకు స్థావరంగా మారుస్తోందని భారత్ మండిపడింది.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!