NTV Telugu Site icon

Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్కు భారత ట్రైన్స్ బంద్.. ఎల్ఐసీ ఆఫీసు క్లోజ్..!

Indian Railway

Indian Railway

Bangladesh – Indian Trains: బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వేస్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో పాటు ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు పాలనా పగ్గాలను అక్కడి ఆర్మీకి అప్పగించడం లాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, గుర్తు తెలియని ప్రదేశానికి మాజీ ప్రధాని షేక్ హసీనా తరలి వెళ్లారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్ కు వెళ్లే ట్రైన్ సర్వీసులను భారతీయ రైల్వే క్యాన్సిల్ చేయడం గమనార్హం.

Read Also: Bengaluru video: వాకింగ్ చేస్తుండగా మహిళపై దుండగుడు దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలతో అక్కడి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆఫీసును మూసేస్తున్నట్లు ఎల్ఐసీ ఇవాళ (సోమవారం) ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీ వరకూ బంగ్లాదేశ్ లోని తమ ఆఫీసు మూసేస్తున్నట్లు ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్’లో వెల్లడించింది. బంగ్లాదేశ్ లోని తాత్కాలిక సర్కార్ కూడా ఆగస్టు ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.