Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- సంక్షోభం ముంగిట భారత్..
- మే 16 నుంచి నిలిచిపోనున్న రష్యా చమురు..
- అమెరికా మినహాయింపులకు ముగియనున్న గడువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికా ఇచ్చిన మినహాయిపులు మే 16వ తేదీతో ముగుస్తుంది. మరోసారి అమెరికా రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపులు ఇవ్వకపోతే భారత్ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభంతో దేశ ఇంధన భద్రత తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా అనుమతులు ఇస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
ఒక వేళ అమెరికా మినహాయింపుల్ని పొడగించకపోతే భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి ఖరీదైన చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చమురు సేకరణ ఖర్చలు పెరుగొచ్చని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. మే నెలలో ఇప్పటి వరకు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్ల రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఒక వేళ రష్యా నుంచి చమురు నౌకలు రాకపోతే మొత్తం నెల సగటు దిగుమతులు రోజుకు 1.9 మిలియన్ బ్యారెళ్లకు తగ్గే అవకాశం ఉంది.
Also Read
Read Also: PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్ వచ్చే చమురు తీవ్రంగా దెబ్బతింది. పెరుగుతున్న చమురు ధరల్ని నియంత్రించేందుకు మార్చి 5న భారత్ దేశానికి అమెరికా ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీని ప్రకారం, భారత్ సముద్రం మార్గం ద్వారా రష్యా చమురును కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత మే 16 వరకు పొడగించారు.
ఇదిలా ఉంటే గడువుకు ముందే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లు ఈ వారం పశ్చిమాఫ్రికా, అమెరికా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఇదే కాకుండా పర్షియన్ గల్ఫ్‌పై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి అజర్బైజాన్, ఆఫ్రికా నుంచి చమురు కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?