PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎల్ 19వ సీజన్లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ పరుగుల విధ్వంసం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (57) అర్ధసెంచరీతో వెన్నెముకగా నిలవగా, ప్రియాంష్ ఆర్య (22), కూపర్ కన్నోలి (21) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు.
అయితే, మధ్య ఓవర్లలో ముంబై బౌలర్ శార్ధూల్ ఠాకూర్ (4 వికెట్లు) విజృంభించడంతో పంజాబ్ ఒక్కసారిగా తడబడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4), శశాంక్ సింగ్ (2), మార్కో యాన్సెన్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో అజ్మతుల్లా ఓమర్జాయ్ (38) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకోగా, చివర్లో విష్ణు వినోద్ (15), బార్ట్లెట్ (18) కీలక పరుగులు జోడించి జట్టు స్కోరును 200 మార్కుకు చేర్చారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, రాజ్ బవా, కార్బిన్ బాష్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సార్లు 200+ స్కోరు చేసిన జట్ల జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డును పంజాబ్ సమం చేసింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఇది 8వ సారి కావడం విశేషం. గతంలో 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ జట్లు కూడా ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాయి. ప్రస్తుతం ఈ నాలుగు జట్లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ ఈ రన్ ఛేజ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!