Site icon NTV Telugu

India On US Tarrifs: మా ఇంధనం మా ఇష్టం, రష్యా మా ‘‘ఆల్ వెదర్-ఫ్రెండ్’’: భారత్..

Russia India

Russia India

India On US Tarrifs: భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అయితే, అమెరికా కామెంట్లపై భారత్ శుక్రవారం ఘాటుగానే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మా ఇంధన అవసరాలను తీర్చడంలో, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా నిర్ణయం తీసుకుంటాము’’ అని జైస్వాల్ చెప్పారు.

Read Also: US tariffs: ట్రంప్ టారిఫ్స్‌పై రాజీ పడే అవకాశమే లేదు: భారత్..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడమే అని అమెరికా వాదించింది. భారత్-అమెరికా సంబంధాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చికాకు కలిగించే అంశంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఇంతమంది చమురు విక్రేతలు ఉన్నప్పటికీ, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ ఒకింత అసహనంతో ఉన్నట్లు చెప్పారు.

అయితే, చమురు కొనుగోలుపై, రష్యాతో స్నేహంపై భారత్ శుక్రవారం స్పందించింది. రష్యా భారత్‌కు ఎల్లప్పుడు ‘‘సన్నిహిత, ఆల్ వెదర్ ఫ్రెండ్’’ అని జైస్వాల్ చెప్పారు. దశాబ్ధాల విదేశాంగ విధానాలను, ప్రస్తుత ఆర్థిక ఆందోళనను తిరిగి నిర్వచించాలని ఏ దేశం బెదిరించలేదు అని స్పష్టం చేశారు. రష్యాతో భారత సంబంధాలను మూడో దేశం వారి దృష్టితో చూడకూడదని భారత్ స్పష్టం చేసింది. రష్యాతో తమ స్నేహం స్థిరమైన, కాలానికి పరీక్షకు నిలబడిందని అభివర్ణించింది.

Exit mobile version