NTV Telugu Site icon

Covid-19 Cases: ఇండియాలో కొత్తగా 656 కరోనా కేసులు.. ఒకరి మృతి

Corona Virus

Corona Virus

Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. వాతావరణ పరిస్థితులు, చలి పెరడగం కూడా వ్యాధి పెరిగేందుకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో ఒకర మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,33,333కి చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,545గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటివరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు.

Read Also: Drone Attack: రెడ్ సీలో ఇండియా ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. రెండు రోజుల్లో రెండో ఘటన..

ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరగుతోంది. గడిచిన నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 52 శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. మరోవైపు JN.1 వేరియంట్ కలవరపరుస్తోంది. ఈ వేరియంట్‌కి సంబంధించి దేశంలో 22 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క గోవాలోనే 21 కేసులు వెలుగులోకి రాగా.. కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే ఇది ఓమిక్రాన్ ఉప వేరియంట్, దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు సాధారణ లక్షణాలతో ఇంట్లోనే కోలుకుంటారని చెబుతున్నారు.