Corona Cases In India: దేశంలో నెమ్మదిగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ చివరి నాటితో పోలిస్తే ఇప్పుడే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 163 రోజులలో ఈ రోజే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు నమోదయ్యాయి.
Read Also: Earth-like exoplanet: భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..
తాజా కేసులతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 4.47 కోట్లకు (4,47,33,719) చేరాయి. గడిచిన 24 గంటల్లో 15 మరణాలు సంభవించాయి. వీటితో ఇప్పటి వరకు 5,30,916 మరణించారు. తాజాగా సంభవించిన మరణాల్లో మహరాష్ట్ర, కేరళ నుంచి నలుగురి చొప్పున మరణించారు. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, పుదుచ్చేరి మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మరణించారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 23,091 కు చేరింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.05 శాతంగా ఉంది. ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు అయింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ సానుకూలత రేటు 2.79 శాతంగా నమోదు అయింది. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,79,712 చేరింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 220.66 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందించారు.