NTV Telugu Site icon

Covid Update: ఇండియాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

Covid

Covid

Covid Update: చైనాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు పెరగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7తో చైనా అల్లాడుతోంది. అక్కడి రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాాల్లో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఈ నెలలో చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో తీవ్ర నిరుద్యోగం.. స్టేడియంలో కానిస్టేబుల్ పరీక్ష..

ఇదిలా ఉంటే చైనా కోవిడ్ పరిస్థితి నేపథ్యంలో భారతదేశం కూడా కేంద్రప్రభుత్వం అప్రమత్తం అయింది. చైనాతో పాటు హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ విధానాన్ని ప్రారంభించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాలని సూచించింది.

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో ఇండియాలో 173 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,670 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.46 కోట్ల మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 5,30,707కి చేరుకుంది. యాక్టివ్ కేసుల మొత్తం ఇన్ఫెక్షన్లలో కేవలం 0.01 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,45, 445కి పెరిగిందని, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 220.10 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించారు.