NTV Telugu Site icon

Sharada Peeth: మన శారదా దేవీని దర్శించుకునే భాగ్యం దగ్గర్లోనే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు కారిడార్.. కేంద్రం యోచన..

Sharada Pheet

Sharada Pheet

Sharada Peeth: హిందూ భక్తుల కోసం కేంద్ర సరికొత్త కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను భారత్ తో కలపాలని భావిస్తోంది. పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠ్ యాత్ర కోసం పీవోకే కారిడాన్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిపై పాకిస్తాన్ తో చర్చించాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో టీత్‌వాల్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని తెరవాల్సి ఉంటుంది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి నిరవధికంగా మూసేయబడింది. శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సర్వీసును నిరవధికంగా నిలిపేశారు.

RAED ALSO: Ugadi Special : దేవుని కడపలో ఉగాది వేడుకలు.. పెద్ద ఎత్తున దర్శించుకున్న ముస్లింలు

బుధవారం కుప్వారా జిల్లాలోని తీత్వాత్ లోని శారదాదేవీ ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ప్రకటన చేశారు. కిషన్ గంగా నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారు. కర్తార్ పూర్ కారిడార్ తరహాలోనే యాత్రికుల కోసం శారదా పీఠాన్ని తెరవాలని రవీందర్ పండిత చెప్పారని, భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుందని, ఇందులో రెండో అభిప్రాయం లేదని ఆయన అన్నారు. ఈ కారిడార్ పై ఇరు దేశాలు చర్చిస్తే శారదా దేవిని దర్శించుకోవడం హిందూ భక్తులకు సులభం అవుతుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి.

శారదా ఆలయం ఎక్కడ ఉంది..?

పురాతన శారదా దేవాలయం, శక్తిపీఠంగా, విద్యా కేంద్రంగా ఉంది. పీవోకేలోని నీలం లోయలో ఉంది. ఇక్కడే శారదా నాగరికత, శారద లిపిని వెళ్లివిరిశాయి. ఈ ఆలయాన్ని 6 నుంచి 12 శతాబ్ధంలో నిర్మించారు. అవిభక్త భారతదేశంలో శక్తివంతమైన ఆలయంగా శారదా ఆలయం ఉండేది. కర్కోట వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపిద కాలంలో ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఆల్ బెరూనీ తన రచనల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించాడు. దేవాలయంగా, ఓ విద్యాసంస్థగా శారదా ఆలయం ఉండేది.

 

 

Show comments