New Electricity Bill: ఇన్నాళ్లు ప్రభుత్వమే మనకు విద్యుత్ అందించేది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశం వస్తోంది. మన మొబైల్ నెట్వర్క్‌లాగే, మనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకరి సర్వీస్ బాగా లేకుంటే, మరో సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎలాగైతే మనం ఒక నెట్వర్క్ నచ్చకుంటే, సిమ్ మార్చి వేరే నెట్వర్క్‌కు మారుతామే అచ్చం అలాగే.
కేంద్రం తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లులో ఈ ప్రదిపాదనలు ఉన్నాయి. దీంతో, భారతదేశ వ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీల కోసం తన రిటైల్ విద్యుత్ మార్కెన్‌ను తెరవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చర్య ద్వారా కేంద్రం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్వహణ పంపిణీదారుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని చూస్తోంది. దీని ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా పవర్, టోరెంట్ పవర్, CESC వంటి ప్రైవేట్ కంపెనీలు దేశవ్యాప్తంగా తమ విద్యుత్‌ను అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.
Read Also: BJP MLA: “హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దు, ఇంట్లో యోగా చేయాలి..”
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత శుక్రవారం ముసాయిదా బిల్లును రాష్ట్రాలకు పంపింది. అయితే, దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. కాబట్టి అవన్నీ ఎలాగూ ఒకే చెబుతాయి. 2022లో ఇలాంటి ప్రయత్నాలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు వ్యతిరేకించాయి. ప్రస్తుతం, ఢిల్లీ ఎన్సీఆర్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో సహా దేశంలోని కొన్ని ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ జోన్లు ప్రైవేటీకరించారు.
నష్టాలను తగ్గించడానికి, పురాతన మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం విద్యుత్ సంస్థలపై ఒత్తిడి తెస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ తన నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో రెండింటిని ప్రైవేటీకరించడానికి బిడ్‌లను ఆహ్వానించింది. జూన్ 2025 నాటికి, రాష్ట్ర విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిదారులకు 6.78 బిలియన్ డాలర్లను బకాయిపడినట్లు, దీని వల్ల విద్యుత్ ఉత్పత్తిదారులు తీవ్రమైన ద్రవ్యకొరత ఎదుర్కొంటున్నట్లు, దీని వల్ల ఈ రంగానికి క్రెడిట్ ప్రవాహాలు తగ్గిపోతున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ సెప్టెంబర్‌లో తెలిపింది.
