NTV Telugu Site icon

Shubhanshu Shukla: రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లబోతున్న రెండో భారతీయుడు ఇతనే..

Shubhanshu Shukla

Shubhanshu Shukla

Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండో-యూఎస్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లడానికి అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిని ఎంపిక చేసింది. ఇటీవలే గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందిన శుభాంశు శుక్లానున ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేశారు. ‘ప్రైమ్ ఆస్ట్రోనాట్’గా ఎంపిక అయినప్పటికీ ఏదైనా కారణం చేత అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురైతే, బ్యాకప్ వ్యోమగామి కూడా ఉంటారు.

శుభాంశు శుక్లా అక్టోబర్ 10, 1985న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించాడు.నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యనభ్యసించి జూన్ 17, 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా ఇతడికి 2000 ఫ్లైట్ అవర్స్ అనుభవం కలిగి ఉన్నారు. సుఖోయ్-30MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ మరియు An-32 వంటి అనేక రకాల విమానాలను నడిపారు.

బ్యాకప్ ఆస్ట్రోనాట్‌గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ నియమించబడ్డాడు. ఇతను ఆగస్టు 26, 1976లో కేరళలోని తిరువాజియాడ్‌లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదివి, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. డిసెంబర్ 19, 1998లో ఐఎఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డారు. ఇతడికి 3000 గంటల ఫ్లైట్ అనుభవం ఉంది.

Read Also: Viral News: ఇదెక్కడి ఆచారం.. ముందుగా వధువు అత్తతో శృంగారం.. ఆ తర్వాతే పెళ్లి..

ఇప్పటి వరకు భారతదేశం నుంచి కేవలం వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మాత్రమే 1984లో సోవియట్ యూనియన్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లారు. అన్ని బాగుంటే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర లిఖించనున్నారు. ఇస్రొ యెక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC), అమెరికాకు చెందిన అక్సియోమ్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, Axiom-4 ద్వారా భారతీయ వ్యోమగామిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) పంపాలని అగ్రిమెంట్ చేసుకుంది. ‘గగన్ యాత్రి’గా పిలువబడే ఇద్దరు అధికారుల శిక్షణ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం అవుతుంది.

Axiom-4 మిషన్ సిబ్బందిలో US యొక్క పెగ్గీ విట్సన్ (కమాండర్), భారతదేశం యొక్క గ్రూప్ కెప్టెన్ శుక్లా (పైలట్), పోలాండ్‌కు చెందిన సావోస్జ్ ఉజ్నాన్స్కి (మిషన్ స్పెషలిస్ట్) మరియు హంగరీకి చెందిన టిబోర్ కాపు (మిషన్ స్పెషలిస్ట్) ఉన్నారు. గతేడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి నలుగురిని టెస్ట్ పైలట్‌ల కోసం ఎంపిక చేశారు. వీరి ప్రాథమిక శిక్షణను గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో యొక్క ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో ప్రారంభించారు. గగన్ యాన్ మిషన్ ద్వారా భారత్ తన మానవ సహిత అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాలని ప్రదర్శించాలనే లక్ష్యంతో ఉంది.