Site icon NTV Telugu

India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..

Pradeep Bhandari

Pradeep Bhandari

India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, ఈ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్‌లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భయంతో పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ దేశం విడిచి పారిపోయేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆరోపించారు.

Read Also: Gopichand Malineni : ఆ హీరో కావాలనే నన్ను పక్కన పెట్టారు.. గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు

పాకిస్తాన్ నాయకత్వానికి మోడీ భయం పట్టుకుందని, అందుకునే పలువురు రాజకీయ నేతలు యుద్ధం వస్తే తాము ఇంగ్లాండ్ వెళ్తామని చెబుతున్నారని అన్నారు. ప్రపంచంలో ప్రతీ దేశం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ సైన్యంపై లేదా దాని రక్షణ సామర్థ్యాలపై సొంత ప్రజలకే నమ్మకలేదని, అందుకే మంత్రులు తమ కుటుంబాల కోసం ఇంగ్లాండ్, ఇతర విదేశాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌కి మోడీ నాయకత్వం తగిన సమాధానం ఇవ్వబోతుందని ప్రదీప్ భండారీ అన్నారు.

Exit mobile version