Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
- హార్ముజ్ సంక్షోభానికి భారత్ చెక్..
- సముద్రగర్భంలో భారీ పైప్‌లైన్ ప్రాజెక్ట్..
- యూఏఈ-ఒమన్ నుంచి నేరుగా గ్యాస్..
- ప్రాజెక్ట్ వ్యయం దాదాపుగా రూ. 40 వేల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Pipeline: భారత్ సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటోంది. దేశ ఇంధన భద్రత కోసం భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. అరేబియా సముద్రం గర్భంలో భారీ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. హార్ముజ్ సంక్షోభం కారణంగా, ఈ ఇరుకైన సముద్ర మార్గంపై ఆధారపడకుండా నేరుగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకునేందుకు భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
యూఏఈ- ఒమన్ నుంచి నేరుగా భారత్‌కు గ్యాస్ వచ్చే ప్రతిపాదిత ప్రాజెక్టుకు సుమారుగా రూ. 40,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఐదు నుంచి ఏడేళ్లు పడుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ కన్సార్టియం సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్ప్రైజ్ (SAGE) నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఒక నివేదికను సిద్ధం చేయమని ప్రభుత్వ రంగ సంస్థలైన GAIL, ఇంజనీర్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లను మంత్రిత్వ శాఖ కోరనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ఏమిటి ఈ పైప్‌లైన్..?
యూఏఈ, ఒమన్ మీదుగా అరేబియా సముద్రం గుండా ఈ పైప్‌లైన్ వెల్తుంది. 2500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వులు ఉన్న ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఖతార్ నుంచి గ్యాస్ పొందేందుకు ఈ పైప్‌లైన్ భారతదేశానికి వీలు కల్పిస్తుంది.
సుమారుగా 3450 మీటర్ల లోతు వరకు ఈ పైప్ లైన్ ఉండొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రగర్భ పైప్లైన్లలో ఒకటిగా నిలుస్తుంది. సముద్రగర్భ పరిస్థితుల్ని అంచనా వేయడానికి సేజ్ సంస్థ ఈ మార్గంలో రూ. 25 కోట్ల వ్యయంతో సుమారు 3000 మీటర్ల టెస్ట్ పైప్‌లైన్ వేసింది.
ఒక వేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హార్ముజ్‌ను పూర్తిగా బైపాస్ చేయవచ్చు. ట్యాంకర్ల అవసరం లేకుండా నేరుగా గ్యాస్ భారత్ చేరుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ చౌకగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూఏఈ తన భూభాగం నుంచి ఒమన్ తీరం వరకు చమురు పైప్ లైన్ నిర్మాణం చేయాలని భావిస్తుంది. ఇదే జరిగితే హార్ముజ్ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒమన్ తీరం నుంచి చమురు ట్యాంకర్లు భారత్ చేరవచ్చు.
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!