NTV Telugu Site icon

E-Air Taxis: 2026 నాటికి భారత్‌‌లో ఈ-ఎయిర్ టాక్సీ సేవలు.. 90 నిమిషాల కార్ జర్నీ 7 నిమిషాల్లోనే..

E Air Taxis

E Air Taxis

E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిలువగా ఎగిరే ఈ బుల్లి విమానాలు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులైన ఎలక్ట్రిసిటీపై ఇవి పనిచేయనున్నాయి.

READ ALSO: Kannappa: సినిమా ఏమో కానీ స్టార్లతో చంపేస్తున్న మంచు విష్ణు

భారతదేశ ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోకి మద్దతు ఇస్తున్న ఇంటర్‌‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, యూఎస్‌కి చెందిన ఆర్చర్ ఏవియేషన్ కలిసి 2026లో ఇండియాలో ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది. రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందిన తర్వాత ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవల్ని ప్రవేశపెట్టనున్నారు. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రజలు సులభంగా ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీంతో పాటు కాలుష్యం కూడా ఉండదు.
ఆర్చర్ ఏవియేషన్, బోయింగ్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ వంటి వాటి మద్దతుతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్(eVTOL) విమానాలను తయారు చేసింది. వీటిని అర్బన్ ఎయిర్ మొబిలిటీకి సంబంధించి భవిష్యత్తుగా భావిస్తున్నారు.

ఈ ‘మిడ్ నైట్’ ఈ-విమానాల్లో నలుగురు ప్రయాణికులతో పాటు పైలట్ 161 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 200 విమానాలతో ప్రారంభించి, వీటిని దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూర్ నగరాల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 60-90 కారులో ప్రయాణించే దూరాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఎయిర్ టాక్సీల ద్వారా చేరవచ్చు. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ మరియు చార్టర్ సేవల కోసం ఇ-విమానాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది. ఆర్చర్ కంపెనీ ఆరు మిడ్ నైట్ ఎయిర్ క్రాఫ్టులను అందించడానికి జూలైలో యూఎస్ వైమానిక దళం నుంచి 142 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అక్టోబర్ నెలలో యూఏఈలో ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.

Show comments