NTV Telugu Site icon

Akash Missile: న్యూ జనరేషన్ “ఆకాష్ మిస్సైల్” ప్రయోగం సక్సెస్..

New Generation Akash Missile

New Generation Akash Missile

Akash Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్) నుండి న్యూజనరేషన్ ఆకాష్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిందని అధికారులు తెలిపారు. డీఆర్డీఓ అధికారులు ఈ పరీక్షను నిర్వహించారు. తక్కువ ఎత్తులో మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించేలా ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఆకాష్ ఆయుధ వ్యవస్థలోని అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంలో పనిచేశాయని అధికారులు వెల్లడించారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాష్ మిస్సైల్ లోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్ మరియు కమాండ్, కంట్రోల్ & కమ్యూనికేషన్ సిస్టమ్‌, పూర్తి ఆయుధవ్యవస్థ పనితీరును అధికారులు ధ్రువీకరించారు. రాడార్లు, టెలీమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మిస్సైట్ డేటా ద్వారా సిస్టమ్ పనితీరును ధ్రువీకరించారు.

Read Also: Union Minister Kishan Reddy: మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విమాన పరీక్షను DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. AKASH-NG వ్యవస్థ శత్రువుల నుంచి అత్యంత వేగంగా వచ్చే వైమానిక ముప్పును ఎదుర్కొగలదు. ఈ పరీక్ష విజయంతో యూజర్ ట్రయల్స్‌కి మార్గం సుగమమైంది.

ఆకాష్ న్యూజనరేషన్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, ఐఏఎఫ్‌ని అభినందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని అన్నారు.