India Pakistan: జీలం నదికి వరదలు.. భారత్ నీటిని వదిలేసిందని పాక్ ఆరోపణ..
- జీలం నదికి భారీగా వరదలు..
- పీఓకేలో ఎమర్జెన్సీ..
- భారత్ నీటిని వదిలిందని స్థానికుల ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం జీలం నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని పాకిస్తాన్ మీడియా నివేదిస్తోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్‌లో జీలం నీటి మట్టం పెరిగినట్లు చెబుతున్నారు.
Read Also: Cars with high mileage: ఈ కార్లు రోజువారీ ప్రయాణానికి బెస్ట్.. మైలేజీలో తోపు
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
పీఓకే స్థానిక పరిపాలన అధికారులు హట్టియన్ బాలాలో నీటి అత్యవసర పరిస్థితిని విధించినట్లు తెలుస్తోంది. మసీదుల ద్వారా స్థానికులను హెచ్చరించినట్లు అక్కడి మీడియా చెబుతోంది. హట్టియన్ బాలా, ఘరి దుపట్ట, మజ్హోయ్, ముజఫరాబాద్‌లోని స్థానికులు నీటి మట్టం పెరుగుతున్నట్లు ధృవీకరించారు, జీలం నది వెంబడి నివసించే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మసీదులలో హెచ్చరిక ప్రకటనలు జారీ చేశామని పేర్కొన్నారు. భారత్ లోని అనంత్‌నాగ్ నుంచి పీఓకేలోకి ప్రవేశించిన జీలం నది పీఓకేలోకి ప్రవేశిస్తుంది.
సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. అయితే, పాక్ చేస్తున్న ఆరోపణల్ని ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది.
భారతదేశం జల ఉగ్రవాదానికి పాల్పడుతోందని, అంతర్జాతీయ నదీ చట్టాలను ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా, భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. “విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది” అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!