NTV Telugu Site icon

Asaduddin Owaisi: ఓవైసీ ఇంటిపై దాడి.. ‘‘జై శ్రీరాం, భారత్ మాతా కీ జై’’ నినాదాలు..

Owaisi

Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపై దుండగులు దాడి చేశారు. గురువారం తన ఇంటిపై దాడి దాడి జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. గుర్తుతెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని చెప్పాడు. ఎక్స్ వేదికగా ఆయన ఢిల్లీ పోలీసులు నిస్సాహయతను గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 34 అశోకా రోడ్‌లోని తన నివాసం ప్రధాన గేటుపై ఉన్న నేమ్ ప్లేట్‌పై నల్ల ఇంక్ విసిరిన విజువల్స్ పంచుకున్నారు. నా ఇంటిని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో నేను ఇప్పుడు లెక్కిస్తున్నాను అని ఓవైసీ ట్వీట్ చేశారు.

Read Also: Upcoming CNG Cars: త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల కానున్న సీఎన్జీ కార్లు ఇవే..!

ఓవైసీ ఇంటి ముందు నేమ్‌ప్లేట్‌పై ఐదుగురు వ్యక్తలు ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు అంటించడం కనిపించింది. ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘జై శ్రీరాం’’ నినాదాలు రాశారు. భారత్ మాతాకీ జై చెప్పకుండా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవానలి దుండగులు రాశారు. దేశంలో 140 కోట్ల మంది కూడా ఇదే పనిచేయాలని వారు రాశారు. ఇలాంటి సంఘటనలను నిరోధించలేకపోయినందుకు ఢిల్లీ పోలీసులపై ఓవైసీ నిరాశ వ్యక్తం చేశారు. అతను తన X పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేసాడు. ‘‘ అమిత్ షా ఇది మీ పర్యవేక్షణలోనే జరుగుతోంది. దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో చెప్పంది’’ అని ప్రశ్నించారు. ఇది పిరికి చర్యల అని, దుండగులు నేరుగా నన్ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

‘‘ నా ఇంటిని టార్గెట్ చేస్తు్న్న గుండాలు నన్ను భయపెట్టలేరు. ఈ సావార్కర్ తరహా పిరికి ప్రవర్తను ఆపండి. నన్ను ఎదుర్కోనే వారిగా ఉండండి, సిర విసిరి, కొన్ని రాళ్లు విసిరిన తర్వాత పారిపోకండి’’ అని ట్వీట్ చేశాడు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఓవైసీ ‘జై పాలస్తీనా’ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల్ని స్పీకర్ రికార్డులను తొలగించాలని ఆదేశించారు.

Show comments