BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- కాంగ్రెస్, ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శలు
- ‘భారత్ బనానా రిపబ్లిక్ కాదు’ అంటూ వ్యాఖ్యలు
- దేశాన్ని పార్లమెంటే పాలిస్తుందని, వీధులు కాదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న తరుణంలో బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో అరాచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం అడ్డుకుందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘దేశాన్ని పార్లమెంట్ పాలిస్తుంది తప్పా వీధులు కాదు’’ అని అన్నారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎప్పుడూ తలవంచలేదని, భవిష్యత్తులోనూ తలవంచేది లేదని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను ఆయన సమర్థించారు. గత మూడు రోజులుగా, శనివారం చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. భారత ప్రజాస్వామ్యం అరచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను అడ్డుకుందని, దేశాన్ని పార్లమెంటే పాలిస్తుందని స్పష్టం చేశారు.
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ఈ నిరసనలు జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గెలిచిన విషయాన్ని రవిశంకర్ ప్రస్తావించారు. ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల్ని ‘‘అరాచక ఉద్యమం’’గా అభివర్ణించారు. ‘‘తాము నిరసనలకు వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికల్లో ఓటముల కారణంగా మీరు వీధి పోరాటాను ఆయుధంగా మార్చుకున్నారు’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!