India: 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు.. ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని 31 డ్యామ్‌లకు వరద పోటెత్తుతోంది.
మహారాష్ట్ర భారీ వర్షాలతో అల్లాడుతోంది. పాల్ఘర్, పూణే జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నా్యి. చించ్వాడ్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నిన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ నగరంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. గోండియా జిల్లాలో నలుగురు వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. గుజరాత్ రాష్ట్రం వానల ధాటికి అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 30 జలాశయాలు 70 శాతం సామర్థ్యాన్ని దాటాయాి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజ్ కోట్, గిర్ సోమనాథ్, జామ్ నగర్, భరూచ్, కచ్, నవ్సారి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్.. సర్కార్ ఆదేశం
మధ్యప్రదేశ్ నర్మదాపురం డివిజన్ లోని అన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. గోదావరి నది అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గత 5 రోజుల్లో 219.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 455 శాతం అధిక వర్షపాతం నమోదు అయింది.
కోస్తా కర్ణాటక, మల్నాడు ప్రాంతాల్లో అనేక చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుంగభద్ర నదీ ప్రవాహం తీవ్ర స్థాయిలో పెరిగింది. దీంతో హంపిలోని వారసత్వ ప్రదేశాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇక తమిళనాడులోని కోయంబత్తూర్, నీలగిరి, ధర్మపురి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఒడిశాలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచానా వేసింది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!