NTV Telugu Site icon

Bill Gates: భారతదేశం నాకు భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోంది.

Bill Gates

Bill Gates

Bill Gates: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తన బ్లాగ్ ‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ సాధిస్తున్న విజయాలను గురించి ప్రస్తావించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోందని అన్నారు. దేశం పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదని నిరూపించిందని ఆయన అన్నారు. భారత్ సాధించిన అద్బుతమైన పురోగతికి మించిన రుజువు లేదని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని, పెద్ద సవాళ్లను ఎదుర్కొనగలదని నిరూపించిందని అన్నారు. దేశంలో పోలియో నిర్మూలించింది, హెచ్‌ఐవి వ్యాప్తిని తగ్గించింది, పేదరికాన్ని తగ్గించింది, శిశు మరణాలను తగ్గించింది, పారిశుద్ధ్యం మరియు ఆర్థిక సేవలకు సౌకర్యాలను పెంచిందని ప్రస్తావించారు. భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, ప్రాణాంతక డయేరియా కేసులకు కారణం అయ్యే వైరస్ ను నిరోధించడానికి రోటా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేసి ప్రతీ బిడ్డకు చేరేలా చేసిందని అన్నారు.

Read Also: Off The Record: కొత్తకోట దంపతుల కొత్త ఎత్తుగడ..! రెండు చోట్ల పోస్టర్ల యుద్ధం

భారతదేశం నిపుణులు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ పంపిణీ చేసే మార్గాలను రూపొందించిందని, 2021 నాటికి 83 శాతం మంది ఏడాది వయస్సు ఉణ్న పిల్లలకు రోటా వైరస్ టీకాలు వేసిందని అన్నారు. ఈ తక్కువ ధర వ్యాక్సిన్ ను ప్రపంచంలో అన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయని తెలిపారు. పూసాలోని భారతదేశం యొక్క ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనల్లో గేట్స్ ఫౌండేషన్, భారత ప్రభుత్వ రంగ సంస్థలతో చేతులు కలిపిందని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాలను గేట్స్ ప్రస్తావించారు.

వచ్చే వారం ఇండియాకు వస్తున్నట్లు గేట్స్ తన బ్లాగులో తెలియజేశారు. రిమోట్ అగ్రికల్చర్ కమ్యూనిటీలలో వ్యర్థాలను, జీవ ఇంధనాలుగా, ఎరువులుగా మర్చడానికి బ్రేక్ త్రూ ఎనర్జీ ఫెల్, విద్యుత్ మోహన్ ఆయన టీం చేస్తున్న పరిశోధనలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. భూమిపై ఉన్న ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా పరిమిత వనరులను కలిగి ఉందని, అయినప్పటికీ సవాళ్లను అధిగమించిన ఎలా పురోగతి సాధించగలదో భారత్ చేసి చూపించిందని అన్నారు.