Fuel Crisis: దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్.. కేంద్రం కీలక ప్రకటన..
- దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు..
- ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు..
- పెట్రోల్, డీజిల్ భయాల మధ్య కేంద్రం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Crisis: ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో కంగారు పడొద్దని కేంద్రం సూచించింది. కొరతపై వస్తున్న వదంతులతో ప్రజలు ఆందోళన పడొద్దని కోరింది. దేశంలో రాబోయే 2 నెలలకు (60 రోజులకు) సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఇప్పటికే సిద్ధమైనట్లు పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ముందుగానే దిగుమతులను ఖరారు చేసుకున్నాయి, దీంతో సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకుంటున్నాయని తెలిపింది.
Read Also: JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
పశ్చిమాసియా పరిణామాలు, ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో వాహనాదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, పట్టణాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, దేశంలో ఎలాంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు పానిక్ కావద్దని చెబుతోంది. హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసినా.. భారత్ 40కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పింది.
భారతదేశంలో మొత్తం నిల్వల సామర్థ్యం 74 రోజులకు సరిపోగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాస్తవ నిల్వలు సుమారు 60 రోజులకు సరిపడా ఉన్నాయి. మరోవైపు, భూగర్భ గుహల్లో భారత వ్యూహాత్మక నిల్వలు కూడా ఉన్నాయి. గల్ఫ్ నుంచి ఎల్పీజీ గ్యాస్ సరఫరా తగ్గినప్పటికీ భారత్ రష్యా, యూఎష్ఏ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి భారీగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఈ మార్గాల ద్వారా ఎల్పీజీ దేశానికి వప్తోంది. తప్పుడు సమచారం వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!