India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- 6వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుపై భారత్ నజర్..
- ఫ్రాన్స్‌తో జతకట్టే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: భారత్ తన వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యాల వద్ద 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఉన్నాయి. చైనా, అమెరికాలు ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావిస్తోంది. ఫ్రాన్స్ నేతృత్వంలోని ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ (FCAS) 6వ తరం యుద్ధ విమానాల కార్యక్రమంలో చేరేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో యూకే, ఇటలీ, జపాన్ నేతృత్వంలోని ‘‘గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ (GCAP)’’ను కూడా భారత్ పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఉన్న 5వ తరం యుద్ధ విమానాలు శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ఉండే ‘‘స్టెల్త్ టెక్నాలజీ’’ని కలిగి ఉంది. 6వ తరం యుద్ధ విమానాల్లో స్టెల్త్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, డ్రోన్లతో సమన్వయం, అధునాతన సెన్సర్లు, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలు కీలకంగా ఉంటాయి. ఇది యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించనుంది.
Also Read
ఫ్రాన్స్‌తో భారత్ జతకట్టే అవకాశం..
నిజానికి FCASను ఫ్రాన్స్, జర్మనీ కలిసి 2017లో ప్రారంభించాయి. ఆ తర్వాత స్పెయిన్ కూడా చేరింది. ఈ ప్రోగ్రామ్‌లో కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాకుండా.. ప్రధాన యుద్ధ విమానం, రిమోట్ క్యారియర్ డ్రోన్లు, విమానాలు-డ్రోన్లు-భూ, సముద్ర దళాలను అనుసంధానించే ‘కాంబాట్ క్లౌడ్’ వంటి వ్యవస్థలు ఉంటాయి. అయితే ఫ్రాన్స్, జర్మనీ మధ్య నాయత్వం, పనుల విభజన, సాంకేతిక హక్కుల విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జర్మనీ ఇందులో నుంచి తప్పుకుంది. ఫ్రాన్స్ కొత్త భాగస్వాముల కోసం చూస్తుండటం భారత్‌కు అవకాశంగా మారింది.
భారత్‌కు ఎందుకు కీలకం:
భారత్ ఎయిర్‌ఫోర్స్‌కు ప్రస్తుతం 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం. కానీ 29 స్వ్కాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. పాత యుద్ధ విమానాలు సేవల నుంచి తప్పుకుంటున్నాయి. ఒక ఫైటర్ స్క్వాడ్రన్‌లో సాధారణంగా 18 విమానాలు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌ను అడ్డుకోవాలంటే 5వ తరం యుద్ధ విమానాలు అవసరం. ఈ నేపథ్యంలోనే భారత్ స్వయంగా AMCA అనే 5వ తరం స్టెల్త్ ఫైటర్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే 6వ తరం యుద్ధ విమానానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ సామర్థ్యాలను వేగంగా అందిపుచ్చుకోవాలని భారత్ భావిస్తోంది.
ఫ్రాన్స్‌తో ఇప్పటికే భారత్‌కు బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఆ దేశం నుంచి భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. AMCA Mark-2 కోసం 120 కిలోన్యూటన్ థ్రస్ట్ ఇంజిన్ అభివృద్ధిలో ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్తో సహకారం కూడా కీలకంగా మారనుంది. ఇదే కాకుండా పలు రక్షణ రంగ ప్రాజెక్టు్ల్లో ఫ్రెంచ్ కంపెనీల భాగస్వామ్యం ఉంది.
భారత్‌కు సాంకేతిక ప్రయోజనం:
ఫ్రాన్స్ భాగస్వామ్యం ఓకే అయితే భారత్‌కు అధునాతన స్టెల్త్ మెటీరియల్స్, రాడార్, AI సాఫ్ట్వేర్, డ్రోన్ కంట్రోల్, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సాంకేతికతల్లో ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా మేక్ ఇన్ ఇండియా తయారీ, ఉద్యోగాలు, భారత రక్షణ ఎగుమతులకు కూడా ఊతం ఇస్తుంది. చర్చలు విజయవంతమైతే భారత్ 2040ల నాటికి 6వ తరం యుద్ధ విమానాలను అందే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!