ఆఫ్ఘనిస్థాన్‌లో వరుసగా బాంబు పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి… దేశ రాజధాని కాబూల్ సైతం తాలిబన్ల వశం అయిన తర్వాత ఈ పేలుళ్లు కలవరపెడుతున్నాయి.. దీంతో.. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నేథప్యంలో.. భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.. ఇప్పటి వరకు ఆఫ్ఘన్ నుంచి 550 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు వెల్లడించింది.. ఆరు ప్రత్యేక విమానాల ద్వారా 550 మందిని భారత్‌కు తరలించామని.. అందులో 260 మంది భారతీయులు ఉన్నారని.. వాళ్లను కాబూల్, దుశాంబె నుంచి తరలించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. మరోవైపు ఇతర ఏజెన్సీల ద్వారా కూడా ఆఫ్ఘన్ నుంచి భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఆఫ్ఘన్‌లో ఉన్న మెజార్టీ భారతీయులను ఇప్పటికే తరలించినట్లు తాము భావిస్తున్నాం అన్నారు అరిందమ్ బాగ్చి.. కానీ, మరికొందరు అక్కడ ఉండొచ్చు.. ఎంతమంది మంది అనేది మాత్రం కచ్చితంగా తెలియదు అన్నారు. భారతీయులతో పాటు ఇతర దేశాల వాసులను కూడా భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు ఎంతమంది వచ్చారంటే..? విదేశాంగశాఖ ప్రకటన
