Site icon NTV Telugu

Natural gas: జాక్‌పాట్ కొట్టిన భారత్.. అండమాన్‌లో భారీగా ‘‘సహజ వాయువు’’

Natural Gas

Natural Gas

Natural gas: భారత్ జాక్‌పాట్ కొట్టింది. దేశంలో మొదటిసారిగా అండమాన్ సముద్రంలో ‘‘సహజ వాయువు’’ నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను కనుగొంది. ప్రారంభ టెస్టుల్లో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ప్రాంతంలో సంభావ్య చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను, ఇంధన మార్కెట్‌ను గణనీయంగా మారస్తుంది.

Read Also: FBI ABSCAM 1980: ఎఫ్‌బీఐ ఉచ్చులో కాసులకు కక్కురుత్తిపడిన అమెరికన్‌లు.. కథ మామూలుగా లేదు!

అండమాన్ దీవుల తూర్పు తీరంలో 17 కి.మీ దూరంలో 295 మీటర్ల నీటి లోతు, 2650 మీటర్ల టార్గెటెడ్ లోతులో ఉన్న శ్రీ విజయంపురం-2 బావి వద్ద ఈ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఈ ప్రాంతంలో 2 లక్షల కోట్ల లీటర్ల భారీ చమురు నిల్వలు ఉండే అవకాశాన్ని మంత్రి హైలెట్ చేశారు. ఇది వెలికితీస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 20 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.

దిగుమతులపై ఆధారపడకుండా, ఇంధన భద్రతను పెంచడంతో పాటు చమురు, గ్యాస్ ఉత్పత్తిలో స్వావలంబనకు ఈ నిక్షేపాలు సహాయపడుతాయి. ఈ నాచురల్ గ్యాస్ నిక్షేపాలను గుర్తించడానికి ముందు జూన్ నెలలో, హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. అండమాన్ లో గయానా పరిణామంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నట్లు చెప్పారు.

Exit mobile version