NTV Telugu Site icon

Hardeep Singh Puri: మనం రష్యా నుంచి చమురు కొనకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది..

Harddep

Harddep

Hardeep Singh Puri: పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్‌ క్రుడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేదన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయానికి సంబంధించి పోస్ట్‌ చేశారు.

Read Also: Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మికుల ఉక్కు సంకల్పం.. మరో వినూత్న కార్యక్రమం..

అయితే, బ్యారెల్‌ చమురు ధర 200 డాలర్ల (రూ.16వేలకు పైమాటే)ను చేరేది అని కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు.. కేవలం ధరల పరిమితి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. దాన్ని భారతీయ సంస్థలు కూడా అనుసరిస్తుంది.. ఈ కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఆంక్షలు పడే ఛాన్స్ ఉందని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఐరోపా, ఆసియాకు చెందిన చాలా దేశాలు రష్యా నుంచి బిలియన్‌ డాలర్ల విలువైన ముడి చమురు, డీజిల్‌, ఎల్‌ఎన్‌జీ, అరుదైన ఖనిజాలను కొనుగోలు చేశారన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన రాసుకొచ్చారు. ధరల పరంగా మన చమురు సంస్థలకు ఎక్కడ లాభం చేకూరుతుందో అక్కడి నుంచి ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తామన్నారు. మన దేశ పౌరులకు అందుబాటు ధరల్లో స్థిరమైన ఇంధన వనరులను అందించడమే మా తొలి ప్రాధాన్యమన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా ఇంధన ధరలు తగ్గుతున్న ఏకైక దేశం మనదే అని కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి చెప్పుకొచ్చారు.