Site icon NTV Telugu

Operation Sindoor: ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది.. భారత్ డీజీఎంవో వెల్లడి

Armypressmeet

Armypressmeet

ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచిందని భారత్ డీజీఎంవో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్‌పై జాయింట్ మిలటరీ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ జరిగిందని పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమపై భారత్ దాడి చేస్తోందని భావించిందన్నారు. మన పోరాటం ఉగ్రవాదులపైనే అని తెలిపారు. పాకిస్థాన్ వివిధ రకాల డ్రోన్లు ప్రయోగించిందని భారత్ డీజీఎంవో స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: PM Modi: రాత్రి 8 గంటలకు మోడీ ప్రెస్‌మీట్.. సర్వత్రా ఉత్కంఠ

ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాలు మార్చుకుంటున్నారని.. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పారు. మే 9, 10 తేదీల్లో పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను చాలా టార్గెట్ చేసిందని.. కానీ మన డిఫెన్స్ వ్యవస్థతో వాటిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. మల్టీ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని.. వివిధ రకాల ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థతో మనం పాకిస్థాన్‌ను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..

‘‘పాకిస్తాన్‌ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నాం.. ఆకాశ్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్‌ దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్‌ క్షిపణులతో నిర్వీర్యం చేశాం. పాక్‌లోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడి చేసింది. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ రన్‌వేకు తీవ్రనష్టం జరిగింది.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు.

‘‘దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు. శత్రువుల విమానాలను మన దేశంలోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్‌కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నాం. పాక్‌కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదు.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు.

 

 

 

 

Exit mobile version