Site icon NTV Telugu

Operation Sindoor: భారత్‌కు నష్టమేమీ జరగలేదు.. ఏకే భారతి వెల్లడి

Armypressmeet

Armypressmeet

భారత్‌లో తక్కువ స్థాయిలో నష్టం జరిగిందని భారత్ డీజీఎంవో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్‌పై జాయింట్ మిలటరీ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. ‘‘సరిహద్దుల దగ్గర భారత వాయుసేన తన ఆయుధ సంపత్తితో దృఢంగా.. సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇచ్చినందున.. భారత వాయుసేన ఆగ్రహాన్ని పాక్ చవిచూడాల్సి వచ్చింది. దేశీయంగా తయారైన “గగనతల రక్షణ వ్యవస్థ” పాకిస్థాన్ పంపిన డ్రోన్లను కూల్చి వేసింది. శత్రు దేశానికి సంబంధించిన దాడులను అడ్డుకోవడంలో భారత వాయుసేన సమర్థవంతంగా వ్యవహరించింది. మన వ్యవస్థలు అద్భుతంగా పని చేశాయి. కూలిన పాకిస్థాన్ ప్రయోగించిన దీర్ఘ శ్రేణి క్షిపణుల శకలాలను మేము దేశ ప్రజలకు చూపిస్తున్నాం. పాకిస్థాన్‌లో జరిగిన దాడులకు ఆ దేశ ఆర్మీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. చైనా డ్రోన్లు , మిస్సైల్‌ను విజయవంతంగా ధ్వంసం చేశాం. భారత్, చైనాల మధ్య సరిహద్దు రేఖను, అంతర్జాతీయ సరిహద్దులను దాటకుండానే పాకిస్థాన్‌లో ఎంచుకున్న లక్ష్యాలను ఛేదించాం. భారత్ వైపు చాలా తక్కువ స్థాయిలో నష్టం జరిగింది.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Operation Sindoor: ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది.. భారత్ డీజీఎంవో వెల్లడి

‘‘భారత వాయుసేన జరిపిన దాడులను అడ్డుకోవడంలో చైనా నుంచి కొనుగోలు చేసిన “పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ” విఫలమైంది. భారత వాయుసేనకు నిర్దేశించిన లక్ష్యాలపై కరాచీలో విజయవంతంగా దాడులు నిర్వహించాం. భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ వాయుసేన చేసిన దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టాం.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు.

ఇది కూడా చదవండి: Manoj Naravane: ‘‘యుద్ధం అంటే రొమాంటిక్ కాదు, మీ బాలీవుడ్ సినిమా కాదు’’: మాజీ ఆర్మీ చీఫ్

 

Exit mobile version