Putin: ప్రపంచంలో అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి భారత్‌కి అన్ని అర్హతలు ఉన్నాయని, భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. గురువారం సోచిలోని వాల్డై డిస్కషన్ క్లబ్ ప్లీనరి సెషన్‌లో పుతిన్ ప్రసంగిస్తూ.. రష్యా భారతదేశంతో అన్ని దిశల్లో సంబంధాలను అభివృద్ధి చేస్తుందని, ద్వైపాక్షిక సంబంధాల్లో గొప్ప విశ్వాసం ఉందని అన్నారు.
‘‘భారతదేశాన్ని నిస్సందేహంగా అగ్రరాజ్యాల జాబితాలో చేర్చాలి, దాని బిలియన్నర జనాభా, ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైన వృద్ధి, ప్రాచీన సంస్కృతి, మరింత వృద్ధికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. భారతదేశం ఒక గొప్ప దేశమని, ఇప్పుడు జనాభా పరంగా అతిపెద్దదని, 150 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలోని ఆర్థిక వృద్ధిలో ముందుందని పుతిన్ అన్నారు. ఇరు దేశాల సహకారం ప్రతీ ఏడాది అనేక రెట్లు పెరుగుతోందని చెప్పారు.
Read Also: Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?
మా సంబంధాల్లో గొప్ప విశ్వాసం ఉందని, భారత సాయుధ దళాల్లో రష్యన్ పరికరాలు సేవల్లో ఉన్నాయని, ఈ సంబంధంపై గొప్ప విశ్వాసం ఉందని, మేమర మా ఆయుధాలను భారత దేశానికి విక్రయించడం లేదు, మేము వాటిని సంయుక్తంగా రూపకల్పలన చేస్తున్నామని చెప్పారు. బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ ప్రాజెక్ట్ గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. భారత్-చైనా మధ్య సరిహద్దులో కొన్ని ఇబ్బందులను పుతిన్ అంగీకరించారు. అయినప్పటికీ తమ దేశాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తెలివైన, సమర్థవంతమైన వ్యక్తులు రాజీ కోసం వెతుకుతున్నారని చెప్పారు.
2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతినప్నాయి. అయితే, ఇటీవల రెండు దేశాలు సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి విత్ డ్రా అయ్యాయి. 2019కి ముందు ఉన్న సరిహద్దుల్ని పునరుద్ధరించారు.