Site icon NTV Telugu

ఇండియాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్త కేసులు ఎన్నంటే..?

కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు విధిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 525 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది.

Read Also: కరోనా దెబ్బకు ఏకంగా ప్రధాన మంత్రి పెళ్లి రద్దు

మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,59,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 17.78గా నమోదైంది. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,65,60,650కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 71.55 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

Exit mobile version