NTV Telugu Site icon

Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

India Corona Cases

India Corona Cases

Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,551 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 70 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 21,591 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదైంది. గురువాం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశంలో 4,00,110 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Srisailam Dam Gates Opened: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి..!

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,26,600 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,35,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,34,45,624 మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,40,40,362కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 36,95,835 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.59 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 7,99,008 మంది కరోనా వైరస్​ బారినపడ్డారు. మరో 1,795 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,63,97,203 కు చేరింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 64,29,807 మంది మరణించారు. ఒక్కరోజే 8,34,923 మంది కోలుకున్నారు. జపాన్‌లో ఒక్కరోజే 2,31,597 కేసులు నమోదు కాగా.. 157 మంది మరణించారు.

Show comments