Site icon NTV Telugu

Corona Cases: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. మరో 33 మంది మృతి

India Corona Cases

India Corona Cases

Corona Cases In India: దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతున్న కొవిడ్ కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,219 కేసులు నమోదు అయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 56,745కు చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.13గా ఉంది. కొవిడ్ బారి నుంచి తాజాగా 9,651 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 3,64,886 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

దేశంలో గడిచిన 24 గంటల్లో 33 మరణాలు సంభవించాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,44,49,726కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,27,965గా ఉంది. అయితే వ్యాధి బారి నుంచి రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో సగటు కోవిడ్ రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. ఇండియాలో 4,38,65,016 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉంది. దేశంలో శుక్రవారం 25,83,815 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.01 కోట్లకు చేరింది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.

NASA Artemis 1 Launch: నేడే ఆర్టెమిస్‌-1 ప్రయోగం.. ఈ రోజైనా దూసుకెళ్తుందా?

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 5,62,135 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో1779 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 609,348,200కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,01,105 మంది మరణించారు. శనివారం మరో 6,91,843 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 585,560,675కు చేరింది. జపాన్‌లో కొత్తగా 1,53,313 కేసులు వెలుగుచూశాయి. మరో 318 మందికిపైగా మరణించారు.దక్షిణ కొరియాలో 89,528 కొవిడ్​ కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో 61,991 కొత్త కేసులు, 308 మరణాలు వెలుగుచూశాయి.

Exit mobile version