Corona Cases In India: దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా6,168 కేసులు నమోదు అయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 59,210కు చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.13గా ఉంది. కొవిడ్ బారి నుంచి తాజాగా 9,685 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 3,18,642 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో 21 మరణాలు సంభవించాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,44,22,246 కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,27,932 గా ఉంది. అయితే వ్యాధి బారి నుంచి రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో సగటు కోవిడ్ రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. ఇండియాలో 4,38,55,3653 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
Gold Rates: భారీగా తగ్గిన పసిడి ధరలు.. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం..!!
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా590,784 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో1,751 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు607,922,595 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,498,279 మంది మరణించారు. గురువారం మరో 756,063 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 584,827,732కు చేరింది. జపాన్‌లో కొత్తగా 167,340 కేసులు వెలుగుచూశాయి. మరో 316 మందికిపైగా మరణించారు.దక్షిణ కొరియాలో 81,499 కొవిడ్ కేసులు, 112 మరణాలు నమోదయ్యాయి.అమెరికాలో 65,815 కొత్త కేసులు, 272 మరణాలు వెలుగుచూశాయి.
