Corona Cases In India: దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,591 కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం నమోదైన కేసుల కన్నా 1,845 కేసులు తగ్గాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 84,931కు చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.19గా ఉంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో 30 మరణాలు సంభవించాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,44,08,132 కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,27,799 గా ఉంది. అయితే వ్యాధి బారి నుంచి రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో సగటు కోవిడ్ రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. ఇండియాలో 4,38,02,993 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4,58గా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
Weather Updates : తెలంగాణకు భారీ వర్ష సూచన..
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 4,56,630 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 890 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 605,808,634 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,488,018 మంది మరణించారు. శనివారం మరో 6,64,326 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 581,048,786 కు చేరింది. జపాన్‌లో కొత్తగా 1,72,865 కేసులు వెలుగుచూశాయి. మరో 248 మందికిపైగా మరణించారు.దక్షిణ కొరియాలో 85,295 కొవిడ్ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి.అమెరికాలో 8,451 కొత్త కేసులు, 8 మరణాలు వెలుగుచూశాయి.ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
