Site icon NTV Telugu

Covid Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

India Corona Cases

India Corona Cases

Covid Cases: దేశవ్యాప్తంగా నిన్నటితో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 9వేలకు దిగువన కేసులు ఉండగా.. గడిచిన 24గంటల్లో 9,062 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొవిడ్​ నుంచి తాజాగా 15,220 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలో 3,64,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Ghulam Nabi Azad Quits: కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన గులాం నబీ ఆజాద్..

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,134 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1 05,058 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,36,54,064 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 25,90,557 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 208.57 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 3,97,047 మంది కరోనా వైరస్​ బారినపడ్డారు. మరో 505 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 597,184,669 కు చేరింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 6,459,813 మంది మరణించారు. ఒక్కరోజే 4,63,140 మంది కోలుకున్నారు. జపాన్‌లో ఒక్కరోజే 1,78,286 కేసులు నమోదు కాగా.. 284 మంది మరణించారు.

Exit mobile version